telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

వినూత్నంగా లవ్ ప్రపోజల్… కానీ చివరకు ఇలా…!?

Louisiana

ప్రేమించిన అమ్మాయికి వినూత్నంగా ప్రపోజ్ చేయాలనుకుని నీటిలోకి దిగిన స్టీవెన్ వీబర్ అనే వ్యక్తి దురదృష్టవశాత్తు నీళ్లలో మునిగిపోయి మరణించాడు. శుక్రవారం ఈ ఘటన గురించి స్టీవెన్ గర్ల్‌ఫ్రెండ్ కెనెషా ఎంటోయిన్ తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. అమెరికాలోని లూసియానాకు చెందిన ఈ జంట టాంజానియాలో విహారయాత్రలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె షేర్ చేసింది. ఇద్దరూ కలిసి బోటులో విహారయాత్రకు వెళ్లగా తన బాయ్ ఫ్రెండ్ స్టీవెన్ వీబర్ నీటిలోపలకు దిగి, తనతో పెళ్లికి ప్రపోజ్ చేశాడని చెప్పింది. “నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి నేను ఇంక ఓపిక పట్టలేను. నీకు సంబంధించిన ప్రతి విషయం నాకు ఇష్టమే. నా భార్యగా ఉంటావా?” అంటూ స్టీవెన్ తన లేఖలో రాశాడు. స్టీవెన్ ప్రపోజ్ చేసే సమయంలో కెనెషా ఎంతో సంతోషంగా ఉంది. నీళ్లలో నుంచి బయటకు రాగానే.. ఇక తాము కొత్త జీవితం మొదలుపెడతామని ఎన్నో కలలు కనింది. కానీ.. దురదృష్టవశాత్తు స్టీవెన్ నీళ్లలోనే చనిపోవాల్సి వచ్చింది. కెనెషా తనలో ఉన్న బాధను కూడా ఫేస్‌బుక్‌లో రాసింది. “నువ్వు నీటిలోపల మునిగి బయటకు రాలేకపోయావు. నువ్వు పెళ్లికి ప్రపోజ్ చేసినపుడు నా జవాబు వినలేదు. అవును నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు పర్ఫెక్ట్ ప్రేమికుడివి. నేను నిన్ను వచ్చే జన్మలో వెతుకుతాను. పెళ్లి చేసుకుంటాను” అని పేర్కొంది. కాగా, కెనెషా షేర్ చేసిన వీడియోలో ఆమె బాయ్‌ఫ్రెండ్ నీటిలో ఒక పేపర్ చూపిస్తూ కనిపిస్తున్నాడు. దానిపై పెళ్లి ప్రస్తావన గురించి రాశాడు. ఆ వీడియోలో నీటి లోపల ఒక రింగ్ కూడా కనిపిస్తోంది.

Related posts