హాలీవుడ్‌లో మీ టూ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో తను శ్రీ దత్తా బాలీవుడ్ లో పెద్ద బాంబే పేల్చింది. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నానా పటేకర్ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని, 2008లో `హార్న్ ఓకే ప్లీజ్` సినిమా సమయంలో తనపై లైంగిక వేధింపులు జరిగాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. నానా పటేకర్, తనుశ్రీదత్తా ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో కేసులు కూడా పెట్టుకున్నారు. వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. మీటూ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలకు అనుకూలంగా ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు. మొత్తానికి పోలీసులకు సరైన ఆధారాలు దొరకనందున ఈ కేసులో విచారణను క్లోజ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే తాము కోర్టుకు వెళతామని తనుశ్రీ దత్తా లాయర్ అన్నారు.
లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కు క్లీన్ చిట్ ఇవ్వడంపై నటి తనుశ్రీ దత్తా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతిలో కూరుకుపోయిన పోలీసు విభాగం, న్యాయవ్యవస్థ అంతకన్నా కళంకితుడైన నానా పటేకర్ ను ఓ మంచివాడిగా తేల్చాయని ధ్వజమెత్తారు. నానా పటేకర్ దౌర్జన్యం, బెదిరింపులు, వేధింపులకు పాల్పడినట్టు తాను మాత్రమే కాదని, గతంలోనూ అనేకమంది చిత్ర పరిశ్రమకు చెందిన మహిళలు సైతం ఆరోపణలు చేశారని తనుశ్రీ దత్తాను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా సంస్థ ట్వీట్ చేసింది.
నువ్వు పార్టీ బాకీ ఉన్నావ్… ప్రముఖ నిర్మాతకు ఛార్మి ట్వీట్