telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ అమ్మాయినే చేసుకుంటా…

ఇటీవల “ప్రతిరోజూ పండగే” సినిమాతో భారీ విజయం అందుకున్నాడు మెగా హీరో సాయితేజ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం “సోలో బ్రతుకే సో బెటర్”. సాయితేజ కు జోడిగా నభా నటేష్ నటిస్తోంది. సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ పూర్తయిపోయింది. అయితే.. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్‌ కానుంది. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉండగా… మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను 34 ఏళ్లుగా ఏ అమ్మాయి లేకుండా చాలా సంతోషంగా ఉన్నానని.. ఇంకో నాలుగు, ఐదు సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోనని తెలిపాడు. కరోనా సమయంలో పెళ్లి ఎందుకని… తాను కెరీర్‌లో ఇంకా మంచి సినిమాలు చేయాలని పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో రాణించాక తాను పెళ్లి చేసుకుంటానని.. తాను ఇంట్లో వాళ్లు చెప్పిన అమ్మాయినే చేసుకుంటానని అన్నాడు సాయి ధరమ్‌ తేజ్‌. అల్లు శిరిష్‌ తన కంటే పెద్ద వాడని… అతని తర్వాతనే తన పెళ్లి మ్యాటర్‌ అని పేర్కొన్నాడు.

Related posts