telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం వెలుగులోకి కీలక అంశాలు..

గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అయిదుగురు కలిసి ఎక్కడికి వెళ్లారు అన్న దానిపైన మిస్టరీ కొనసాగుతున్నది. మిస్టరీని ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. మాదాపూర్ లోని హాస్టల్ నుంచి రాత్రి తొమ్మిది గంటల 33 నిమిషాలకు బయటికి వచ్చిన యువకులు.. రాత్రి 10 గంటల 30 నిమిషాల సమయంలో రాడిసన్ హోటల్ వద్ద ఆగారు. రాత్రి 11 గంటల సమయంలో డిఎల్ఎఫ్ సమీపంలో ఉన్న హోటల్ కి వెళ్ళిన యువకులు.. గంట పాటు హోటల్ లోనే గడిపారు. హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మధ్యలో కూర్చొని భాతఖని కొట్టిన యువకులు.. రాత్రి రెండు గంటల 30 నిమిషాలకు విప్రో జంక్షన్ కు చేరుకున్నారు. రెండు గంటల 43 నిమిషాలకు విప్రో జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరగగా… విప్రో నుంచి గౌరీ దొడ్డి వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్న దానిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని.. మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. విప్రో జంక్షన్ వద్ద రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ రోడ్ క్రాస్‌ చేశారని.. గ్రీన్ సిగ్నల్ నుంచి వస్తున్న టిప్పర్ ని కారు ఢీ కొట్టిందని తెలిపారు. యువకులతో వెళ్తున్న కారులో కొన్ని సీసాలు లభ్యమయ్యాయని.. వీటికి సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేశామని మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు వెల్లడించారు. మాదాపూర్ లోని పిజి హాస్టల్ కి వెళ్లాల్సిన వాళ్ళు ఎందుకు విప్రో వైపు వచ్చారని…. విచారణ జరుగుతుందన్నారు.

Related posts