telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత సరిహద్దులు మూసేసిన బంగ్లాదేశ్…

ప్రస్తుతం ఇండియాలో రోజుకు మూడు లక్షల కరోనా కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సినేష జరుగుతున్న కేసులు పెరుగుతుండటంతో అందరిలో ఆందోళన పెరుగుతుంది. అయితే మన దేశంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న వేళ పొరుగునున్న బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  భారత్ తో ఉన్న బంగ్లాదేశ్ సరిహద్దులను మూసివేసింది.  భారత్ లో కరోనా వేరియంట్లు సంఖ్య అత్యధికంగా నమోదవుతున్నాయి.  ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడి అధికారులు చెప్తున్నారు.  సరిహద్దుల వెంట జన సంచారాన్ని, వాహనాల రాకపోకలను నిషేదిస్తున్నట్టు బంగ్లాదేశ్ విదేశాంగశాఖ మంత్రి పేర్కొన్నారు.  రెండు దేశాల మధ్య సరుకుల రవాణాకు మాత్రమే తాత్కాలిక అనుమతులు ఇస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొన్నది.  భారత్ లో కరోనా పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 14 నుంచి బంగ్లాదేశ్ విమాన సర్వీసులపై నిషేధం విధించింది.  చూడాలి మరి మిగిత మన పొరుగు దేశాలు ఏం చేస్తాయి అనేది.

Related posts