telugu navyamedia
సినిమా వార్తలు

అమృత్‌సర్‌లో ట్రిపులార్‌ టీమ్‌.. పిక్ వైరల్

*పంజాబ్ లో గోల్డెన్ టెంపుల్​లో ఆర్​ఆర్​ఆర్ టీం సంద‌డి..
*గోల్డెన్ టెంపుల్ ని సంద‌ర్శించిన రాజ‌మౌళి, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌..
*ఇద్ద‌రు ఫ్రీడ‌మ్ ఫైట‌ర్ల ఫ్రెండ్ షిప్ స్టోరీ ఆర్​ఆర్​ఆర్ ..

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్​.ఆర్.​ఆర్ .. ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్ర‌మంలో ‘ఆర్​ఆర్​ఆర్​’ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా చిత్ర బృందం.. అమృత్​సర్​లోని గోల్డెన్ టెంపుల్​ను సందర్శించింది. చిత్ర దర్శకుడు రాజమౌళితో పాటు హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్.. పూజలు నిర్వహించారు. ​

ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్​చరణ్​, కొమురం భీమ్​గా ఎన్టీఆర్​ నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్​చరణ్​ సరసన అలియా భట్​, ఎన్టీఆర్​ సరసన ఒలివియా మోరిస్​ నటిస్తున్నారు. అజ‌య్‌దేవ్‌గ‌న్‌, స‌ముద్ర‌ఖ‌ని, శ్రియ‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Related posts