telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

ఏమండోయ్ ఇది విన్నారా.. యూఎస్బి కి కూడా కండోమ్ అంట.. ఇదేమి చోద్యం.. !

usb boxer to prevent cable hacking

ఎయిడ్స్ పుణ్యామా అని కండోమ్స్ గురించి విన్నాము, కాని ఈ యూఎస్బి కండోమ్స్ గురించి ఎక్కడా వినలేదు. అసలు నిజంగానే ఇలాంటివి ఉన్నాయా, ఉంటె ఎలా వాడాలి అంటూ ఆలోచించకండి. అధునాతన టెక్నాలజీతో మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చాయి ఈ యూఎస్బి కండోమ్స్. వీటి పనితీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. అసలు యూఎస్బి
కండోమ్స్ అంటే ఏమిటి ఇవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. యూఎస్బి కండోమ్స్ ఉపయోగం ఏమింటే.. ప్రస్తత కాలంలో స్మార్ట్ ఫోన్ ల వినియోగం ఎక్కువగా ఉంటోంది. రోజు వారి వినియోగంలో చార్జింగ్ లు సరిపోక పోవడంతో ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బస్టాండ్లు మొదలు పబ్లిక్ టాయిలెట్స్ ఇలా ఎక్కడపడితే అక్కడ యూఎస్బి పోర్టులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు కూడా వాటిని వినియోగిస్తున్నారు.

ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే. హ్యాకర్లు ఎంతో తెలివిగా ఈ యూఎస్బి పోర్టులని వినియోగిస్తూ హ్యాకింగ్ చేస్తున్నారు. ఈ విషయం తెలిపింది ఎవరో కాదు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కి చెందిన అటార్నీ జనరల్. ఎక్కడ పడితే అక్కడ ఉండే యూఎస్బి పోర్టులు వాడవద్దని హెచ్చరికలు జారీ చేసింది. అయితే మరి అలాంటి సైబర్ నేరగాళ్ళ బారిన పడకుండా ఉండాలంటే ఏమి చేయాలంటే. యూఎస్బి డేటా బ్లాకర్స్ వీటినే (యూఎస్బి కండోమ్స్ అంటారు. ) వాడాలని అంటున్నారు నిపుణులు. వీటి వలన ఫోన్ డేటా చోరీ అయ్యే అవకాశాలు లేవని. మీరు నిశ్చింతగా వీటి ద్వారా ఫోన్ చార్జింగ్ పెట్టుకోవచ్చని అంటున్నారు.

Related posts