telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఐరన్ మ్యాన్”గా బాలయ్య… దర్శకుడు ఎవరంటే ?

balakrishna new avatar for 105th movie

దర్శకుడు, నటుడు రవిబాబు కంటూ ప్రత్యేక శైలి ఉంది. ఆయన సినిమాలు కూడా చాలా వెరైటీగా ఉంటాయి. ఫస్ట్ మూవీ ‘అల్లరి’ నుంచి ‘అనసూయ’, ‘నచ్చావులే’, ‘అమరావతి’, ‘అవును’, ‘అవును 2’ వంటి దేనికవే విభిన్న కథా చిత్రాలనే రూపొందించారాయన. రీసెంట్‌గా ‘అదుగో’ అంటూ పంది పిల్లతో ఒక ప్రయోగాత్మక చిత్రం చేసాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా వర్కౌట్ కాలేదు. తాజాగా రవిబాబు ‘ఆవిరి’ అనే వైరెటీ టైటిల్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆయన ఆలీతో జాలీగా ప్రోగ్రామ్‌లో పాల్గొని తన మనసులోని విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రవిబాబు. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత నాకు ఫోన్ చేసి ఇదే విషయాన్ని అడిగారు. అపుడు నేను మీ సినిమాకు దర్శకత్వం వహించడం నాకు గౌరవం అన్నాను. దానికి బాలయ్య కూడా మీ దర్శకత్వంలో నటించడం నాకు గౌరవం అన్నారు. ఆయనతో వ్యక్తిగతంగా మంచి అటాచ్‌మెంట్ ఉందన్నారు రవిబాబు. బాలకృష్ణతో ఏ సినిమా చేసిన టైటిల్ మాత్రం ‘ఐరన్ మ్యాన్’ అంటూ షాకింగ్ సమాధానమిచ్చాడు. మొత్తానికి ఈ కాంబినేషన్ సెట్ అయిన కాకపోయినా.. ‘ఐరన్ మ్యాన్’ టైటిల్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related posts