telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తాప్సికి కంగనా కౌంటర్… ఒక్క సోలో హిట్‌ సినిమా కూడా…!

Kangana

బాలీవుడ్‌లో ప్రస్తుతం బంధుప్రీతి గురించి హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ఇన్‌సైడర్-అవుట్ సైడర్ అంటూ హీరోయిన్ కంగన లేవనెత్తిన అంశం గురించి అందరూ స్పందిస్తున్నారు. ఈ విషయంపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కంగనా, తాప్సి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వారి మధ్య మాటల తూటాలు ఇంకా పేలుతూనే ఉన్నాయి. తాజాగా తాప్సీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కంగనా చేసిన వ్యాఖ్యలపై స్పందించింది. తనను తాను ‘ఏ గ్రేడ్’ హీరోయిన్‌గా తాను పరిగణించుకోలేదని ఆమె చెప్పింది. మరి కంగనా ‘ఏ గ్రేడ్’ హీరోయిన్‌ ఎలా అయిందో తనకు తెలియదని ఆమె ఎద్దేవా చేసింది. దీనిపై కంగనా టీం ట్విట్టర్ వేదికగా ఎంటరై కౌంటర్ ఇచ్చింది. కంగనా సినిమాలో బాగా నటిస్తుందని, ఆమెకు దృఢమైన వ్యక్తిత్వం వుందని, వీటన్నింటికి మించి క్వీన్‌, మణికర్ణిక వంటి హీరోయిన్‌ ప్రాధాన్యమున్న హిట్‌ చిత్రాల్లో నటించిందని చెప్పింది. ఒకే ఒక్క సోలో హిట్‌ సినిమా కూడా మనల్ని ‘ఏ గ్రేడ్’‌ హీరోయిన్‌ను చేయగలదని చెప్పుకొచ్చింది.

Related posts