telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రాజకీయాలోకన్నా మెగా స్టార్‌గానే నేను సంతోషంగా ఉన్నా…

Chiranjeevi

తెలుగు సినీ పరిశ్రమను కొన్నాళ్లుగా ఏలుతున్న చిరంజీవి ఆ మధ్య రాజకీయాలలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇది దాదాపు 10 సంవత్సారాల క్రితం జరిగింది. ఆ తరువాత రాజకీయాలను వదిలి ఖైదీ నెం.150తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి అభిమానులకు వరుస సినిమాలను అందిస్తూ ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం చిరు ఆచార్య సినమాలో చేస్తున్నాడు. అయితే మళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని, జాతీయ స్థాయి పార్టీలో రాజ్య సభ సభ్యుడిగా సీటు ఇచ్చేందుకు పార్టీ సిద్దంగా ఉందని వార్తలు వినిపించాయి. అయితే ఆహా ఓటీటీ వేదికగా జరుగుతున్న శామ్ జామ్ ప్రోగ్రాంలో పాల్గొన్న చిరు తన పొలిటికల్ రీఎంట్రీ పై క్లారిటీ ఇచ్చేశాడు. గడిచిన పదేళ్లలో నేను ఎంతో తెలుసుకున్నాను. రాజకీయాలు తనకు సెట్ అవ్వవని, రాజకీయాలోకన్నా మెగా స్టార్‌గానే నేను సంతోషంగా ఉన్నాని, మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన కూడా లేదని తేల్చి చెప్పేశాడు. అయితే ప్రస్తుతం చిరు ఆచార్య సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరువాత లూసిఫర్ రీమేక్‌లో నటించనున్నాడు. లూసిఫర్ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నాడు. చూడాలి మరి ఈ సినిమాలు ఎప్పటికి విడుదల అవుతాయి అనేది.

Related posts