telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగ్

Nag

కింగ్ నాగార్జున ఇటీవల మన్మధుడు 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. ప్రస్తుతం ఆయన తెలుగులో అహిషోర్ సాల్మోన్ ద‌ర్శక‌త్వంలో ‘వైల్డ్ డాగ్‌’ అనే సినిమా చేస్తున్నారు నాగ్ . ఈ సినిమాలో డేర్ డెవిల్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కాగానే గరుడ వేగ ఫేమ్ ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో ఓ సినిమా చేసునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏషియన్ గ్రూప్ చైర్మన్ నారాయణదాస్ నారంగ్ జన్మదినం సందర్భంగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ తాము సంయుక్తంగా కింగ్ నాగార్జున హీరోగా నిర్మించనున్న ఈ భారీ చిత్రాన్ని ప్రకటించారు.ఇక ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకు సంబందించిన పూర్తి వివరాల్లో త్వరలో తెలియనున్నాయి. మరోవైపు బాలీవుడ్ లో ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

Related posts