telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

దేశవ్యాప్తంగా యూఐడీఏఐ సొంత ఆధార్ సేవా కేంద్రాలు… విజయవాడలో ప్రారంభం ..

aadhar own service centers by uidai in vijayawada

దేశ వ్యాప్తంగా సొంతంగా 114 ఆధార్‌ సేవా కేంద్రాలను ప్రారంభించేవిధంగా ప్రణాళికలు వేసుకున్న భారత విశిష్ట సంఖ్య ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) తాజాగా దిల్లీ, విజయవాడల్లో ఆ కేంద్రాలను ప్రారంభించింది. ఆధార్‌ నమోదు, మార్పులు వంటి సేవలను ఈ కేంద్రాలు అందిస్తాయని చెప్పారు. ఇప్పటికే బ్యాంకులు, పోస్ట్‌ ఆఫీసులు, ఇతర కేంద్రాల్లో ప్రజలు ఈ సేవలను ఇతరుల ద్వారా అందుకుంటున్నారు. త్వరలోనే నేరుగా యూఐడీఏఐ సొంత కేంద్రాల్లో దేశంలోని 53 నగరాల్లోని 114 ప్రాంతాల్లో ఈ సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి కేంద్రాలు దిల్లీ, విజయవాడలో ప్రయోగాత్మకంగా ప్రారంభమయ్యాయి.

ఆధార్‌ సేవా కేంద్రంలో ఒకే రోజులో దాదాపు 1,000 మంది వాటి ద్వారా సేవలు అందుకోవచ్చు. ప్రభుత్వ సెలవు దినాలతోపాటు మంగళవారం తప్ప మిగతా అన్ని రోజుల్లో ఈ కేంద్రాలు పనిచేస్తాయి. విజయవాడలో ప్రారంభించిన కేంద్రంలో రోజుకి 500 మంది సేవలు అందుకోవచ్చు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల మధ్య ఖర్చు అవుతుందని అంచనా. పాస్‌ పోర్టు సేవా కేంద్రాల మాదిరిగా వీటి సేవలను అందించాలని భావిస్తున్నారు. ప్రజలు ఈ కేంద్రాలకు వెళ్లడానికి కొన్ని రోజుల ముందే ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. తమకు వీలైన సమయంలోనే వెళ్లి సేవలను పొందొచ్చు.

Related posts