telugu navyamedia
సినిమా వార్తలు

కంగనాపై కామెంట్స్ తో షాకిచ్చిన అలియా

Alia-Bhatt

ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. ఇతర నటీనటుల ప్రవర్తన గురించి ఘాటుగా స్పందించింది. గతంలో రణబీర్ కపూర్, అలియా భట్ లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కంగనా ఎన్ని వ్యాఖ్యలు చేసినా అలియా భట్ వాటిపై పెద్దగా స్పందించలేదు. ఇటీవల కంగనా మరోసారి అలియాపై మండిపడింది. “మణికర్ణిక” సినిమాలో తన నటనను, “గల్లీబాయ్”లో అలియా నటనతో పోల్చడంపై కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది. అలియా నటన అంత గొప్పగా లేదని, స్టార్ కిడ్స్ ని పొగడడం ఆపమని మీడియాకి చురకలు అంటించింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన అలియా చేసిన కామెంట్స్ అందరినీ షాక్ కు గురి చేసాయి.

కంగనా వర్క్ అంటే తనకు చాలా గౌరవం ఉందని, తన అభిప్రాయాన్ని గౌరవిస్తానని, “రాజీ” సినిమాలో తన నటనను కంగనా ఎంతగాని ప్రశంసించిందని, మరింతగా కష్టపడితే ఆమె నన్ను పొగిడే రోజు వస్తుందని చాలా తెలివిగా, మెచ్యూర్డ్ గా సమాధానం చెప్పింది అలియా. అలియా సమాధానం విన్న నెటిజన్లు గొడవ పెద్దది చేయకుండా అలియా ప్రవర్తించిన తీరుకు మెచ్చుకుంటున్నారు.

Related posts