telugu navyamedia
సినిమా వార్తలు

చిరంజీవిపై న‌ట్టికుమార్ ఘాటైన వ్యాఖ్య‌లు..

చిరంజీవి గారు అంటే మాకు నమ్మకం , గౌరవం ఉంది అంటూనే  నిర్మాత నట్టి కుమార్  ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. దాస‌రి నార‌య‌ణ గారు త‌రువాత చిరంజీవి గారినే పెద్డ‌గా ఉండాల‌ని చెప్పిన మొద‌టి వ్య‌క్తిని నేనే అని..అది వాస్త‌వం అని.. విభజించి పాలించు చేయడం క‌రెక్ట్‌ కాద‌ని నట్టి కుమార్ రెచ్చిపోయారు. ఎవ్వ‌రిని ప‌ట్టించుకోకుండా ఇంటి ద‌గ్గ‌రే మీటింగ్ పెట్టుకోవ‌డం ఉద్దేశం ఏంటి అని గ‌ట్టిగా అడిగారు. చిరం జీవి గారికి చిన్న సినిమా నిర్మాతలు గుర్తున్నారా..లేరా? మీ ప‌ది మంది కోసం మీటింగ్ పెట్టుకుంటారా అని సూటిగా అడిగారు.

ఏపీ సీఎం జగన్ గారు ,ప్రొడ్యూసర్ కౌన్సిల్ ను , ఫిల్మ్ ఛాంబర్ ను ఆహ్వానించకుండా..పర్సనల్ గా ఎందుకు పిలుస్తున్నారు. AP ప్రభుత్వం ఇచ్చిన 35 జి వో అమలు కావడం లేదు, సినిమా టికెట్ 100 రూపాయలు , B , C థియేటర్ లలో 30 నుంచి 50 చెయ్యాలి … జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు 35 జి వో ను ఎట్టి ప‌రిస్థితుల్లో రద్దు చేయ‌డానికి వీలు లేద‌ని చెప్పారు.

టికెట్ రేట్స్ 100 రూపాయలు ఉండటం వల్లే తిమ్మరసు , sr కల్యాణ మండపం సినిమాలు మంచి కలెక్షన్స్ వచ్చాయ‌ని అన్నారు. ఆగస్టు 16వ తేదీన సినీ పరిశ్రమ సమస్యలను చర్చించడానికి హీరో బాలకృష్ణను, నిర్మాతల మండలి వైస్ ప్రెసిడెంట్, కార్యదర్శిని ఎందుకు పిలవలేదని మండిప‌డ్డారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మా అసోసియేషన్ కాదు , 24 శాఖలు ఉంటాయని అది గ్రహించాలని అన్నారు.

చిరంజీవి మీటింగ్ లో పెద్ద నిర్మాతలు తప్పా.. చిన్న నిర్మాతలు లేరు. మీరు మీరు మాట్లాడుకొని 150రూ 200 పెంచుకొంటే మేం నాశ‌నం అయిపోవాలా అంటూ చిరంజీవిని ప్ర‌శ్నించారు. విశాఖ‌ప‌ట్నానికి 161 జి వో ప్ర‌కారం 326 ఎక‌రాలు లాండ్‌ ఇచ్చాము. సినిమా హబ్ గా స్థలం ఇస్తన్నాన్న ఎందుకు స్పందించడం లేదు . క‌రోనా టైం లో థియేటర్స్ కి 3 నెలలు కరెంట్ బిల్లు సబ్సిడి ఇస్తామని హామీ ఇచ్చారు… అమలు కాలేదు.. చిన్న నిర్మాతలు బ‌త‌కాలి , ద‌య చేసి చిన్న ,పెద్ద వాళ్ళను కలుపుకొని పోవాలి సార్ చిరంజీవి.

ఏపీ లో 35 జి ఓ అమలు చేయాల‌ని. జాయింట్ కలెక్టర్ , ఆర్ డి ఓ, ఎమ్ ఆర్ ఓ లతో మాట్లాడిన ప్రయోజనం లేదు.100 రూపాయాల వసూల్ చేస్తున్నారు… చిన్న సినిమాకు 5 షో నా చిన్నప్పటి నుంచి వింటున్నాము…ఇంతవరకు కాలేదు…తెలంగాణ లో సినిమా హబ్ అని ప్రకటిస్తున్నారు…ap పరిస్థితి ఏంటి అని నట్టి కుమార్ అడిగారు.

కాగా.. ఈ  రోజున హైదరాబాద్‌లో నిర్మాత నట్టి కుమార్ ప్రెస్‌ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

Related posts