telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

మంత్రి పెద్దిరెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలని జడ్జి ఫిర్యాదు

Peddireddy

రాష్ట్ర పంచాయతీరాజ్, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఓ జడ్జి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 15వ తేదీన జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి తనను అవహేళన చేస్తూ, కించ పరిచేలా మాట్లాడారని జడ్జి రామకృష్ణ ఆరోపిస్తూ చిత్తూరు జిల్లా బి.కొత్తకోట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మంత్రి పెద్దిరెడ్డి మీద ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని హెడ్ కానిస్టేబుల్ రెడ్డెప్ప నాయక్ కు అందజేసిన ఫిర్యాదులో కోరారు. ‘జడ్జి రామకృష్ణ ఎవడో నాకు తెలియదని, వాడు, వీడు అంటూ, తన పట్ల మంత్రి అవమానకరంగా మాట్లాడారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం సస్పెన్స్ లో ఉన్న రామకృష్ణ పై పది రోజుల క్రితం బి. కొత్తకోటలో దాడి జరిగింది. ఈ దాడి వెనుక మంత్రి పెద్దిరెడ్డి ఉన్నారని అప్పట్లోనే జడ్జి రామకృష్ణ ఆరోపణలు చేశారు. మంత్రిగా ఉంటూ పెద్దిరెడ్డి మాట్లాడిన మాటలు ప్రస్తుతం కోర్టులో ఉన్న కేసు విచారణను ప్రభావితం చేసేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. మంత్రి సమీప బంధువైన ఒక హైకోర్టు మాజీ న్యాయమూర్తితో తాను పోరాటం చేస్తున్నానని, అది మనసులో పెట్టుకుని మంత్రి పెద్దిరెడ్డి తనను వేధింపులకు గురి చేస్తున్నారని జడ్జి ఆరోపించారు.

Related posts