telugu navyamedia
సినిమా వార్తలు

సోనీ సంస్థకు షాకిచ్చిన హైకోర్టు

Bombay High Court

తమిళ అగ్ర నటుడు అజిత్‌ నటించిన “వాలి”, “సిటిజన్‌”, “విలన్‌”, “వాంజినాథన్‌” తదితర 17 చిత్రాల పాటలను సోని సంస్థ ఎల‌క్ట్రానిక్ మీడియాలో ప్రసారం చేయడంపై మద్రాసు హైకోర్టు నిషేధం విధించింది. నగరానికి చెందిన పేషోర్‌ రికార్డ్స్‌ సంస్థ మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో “వాలి”, “సిటిజన్‌”, “విలన్‌” సహా 17 చి త్రాల ఆడియో రైట్స్‌ను ఆ చిత్ర నిర్మాతల నుంచి తాము పొందామ‌ని, కానీ సోని మ్యూజిక్‌ సంస్థ ఆ పాటను థింక్‌ మ్యూజిక్‌, యూ ట్యూబ్‌, గానా మిక్సీ తదితర చానళ్లలో ప్రసారం చేస్తోందని, ఇది కాపీ రైట్‌ నిబంధనలకు వ్యతిరేకమని తెలిపారు. ఈ విషయాన్ని సోని సంస్థకు తెలియజేసినా సరైన సమాధానం రాలేదని ఈ సంద‌ర్భంగా తెలిపారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి 17 చిత్రాల పాటలను సోని సంస్థ ప్రసారం చేయడంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Related posts