telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షబానా కామెంట్స్ పై కంగనా సోదరి కౌంటర్

Kangana

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇటీవల కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఒక్కటేమిటి బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి, డ్రగ్స్, మహారాష్ట్ర ప్రభుత్వ పనితీరు… ఇలా అన్ని విషయాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా సీనియర్ నటి షబానా అజ్మీ కూడా కంగనపై విమర్శలు గుప్పించారు. పత్రికల్లో తన పేరు ఉండదేమోనని కంగన భయపడుతోందని, తనకు వచ్చిన నటన మాత్రమే చేసుకుంటూ ఎందుకు ఉండడం లేదని కామెంట్స్ చేశారు. అయితే షబానా వ్యాఖ్యలపై కంగన సోదరి రంగోలీ ఫైర్ అయింది. “ప్రియమైన షబానాజీని, ఆమె భర్తను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మీరు మీకు వచ్చిన నటన, కవిత్వం గురించి మాత్రమే కాకుండా ఇతర విషయాలు ఎందుకు పట్టించుకుంటున్నారు? మీకో రూల్.. కంగనకో రూలా? భారత వ్యతిరేక రాజకీయాల్లో ఎందుకు పాలు పంచుకుంటున్నారు? వార్తల్లో నిలవడం కోసమేనా? మీ భారత వ్యతిరేక రాజకీయాలు నిజాయితీతో కూడుకున్నవైతే.. భారత్‌కు అనుకూలంగా ఉండే కంగన అజెండా కూడా నిజాయితీతో కూడుకున్నదే” అని రంగోలీ పేర్కొంది.

Related posts