ఇండియాలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఈనెల 16 వ తేదీ నుంచి వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. జనవరి 20 వ తేదీ నుంచి చుట్టుపక్కల ఉన్న దేశాలకు కూడా వ్యాక్సిన్ ను పంపిస్తోంది ఇండియా. నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ ఇలా అనేక దేశాలకు ఇండియా నుంచి వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నది. వరంగల్ అర్బన్‌లో హెల్త్ వర్కర్ వనిత మృతి చెందింది. వ్యాక్సిన్ వల్లే చనిపోయిందంటూ బంధువుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. హెల్త్ వర్కర్ వనిత మృతి కారణం వ్యాక్సిన్ రియాక్షన్ అని వైద్యాధికారులు నిర్ధారించలేదు. ఈనెల 22న వ్యాక్సిన్ తీసుకుంది హెల్త్ వర్కర్. ఆ జిల్లాలోని శాయంపేట అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్నది హెల్త్ వర్కర్ వనిత. టీకా వేసుకున్న తర్వాతే ఆమె మృతి చెందటంతో… తోటి వర్కర్లు కూడా భయాందోళనకు గురవుతున్నారు. తమకు ఏమైనా అవుతుందోననే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు ఏపీలోనూ కరోనా టీకా తీసుకున్న ఆశావర్కర్ మృతి చెందింది. గుంటూరుకు చెందిన ఆశావర్కర్ ఈ నెల 19న టీకా వేయించుకుంది. అయితే… ఆ టీకా వికటించడంతో ఆమె మృతి చెందింది.
previous post