telugu navyamedia
క్రీడలు వార్తలు

సన్నీ ఆల్ టైం ఐపీఎల్ ఎలెవెన్… కెప్టెన్ ఎవరంటే…?

ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. అయితే ఐపీఎల్ 2021 ఆరంభానికి ఒకరోజు ముందు భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్‌ జట్టును ప్రకటించాడు. గవాస్కర్ తన ఆల్‌టైమ్ ఐపీఎల్‌ టీమ్‌కి కెప్టెన్, వికెట్ కీపర్‌గా చెన్నై సారథి ఎంఎస్ ధోనీని ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, క్రిస్ ‌గేల్‌ని ఎంచుకున్నాడు. అయితే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ని మూడో స్థానానికి పరిమితం చేశాడు. ఇక విరాట్ కోహ్లీకి నెం.4లో అవకాశం ఇచ్చాడు సన్నీ. ఇక మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనాకి తన జట్టులో గవాస్కర్ అవకాశం కల్పించాడు. ఐపీఎల్ టోర్నీలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే రైనాకు ఐదవ స్థానం ఇచ్చాడు. ఇక ఏబీ డివిలియర్స్‌, ఎంఎస్ ధోనీకి ఫినిషర్ బాధ్యతలు అప్పగించాడు. రవీంద్ర జడేజా, సునీల్ నరైన్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లకి… ఇక పేస్ విభాగంలో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్స్ భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాకి చోటు దక్కింది. అయితే గవాస్కర్ నలుగురు ప్రొఫెషనల్ బౌలర్లను మాత్రమే తీసుకోవడం ఇక్కడ గమనార్హం. టీ20ల్లో ఒక్కో బౌలర్‌ గరిష్ఠంగా 4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకో 4 ఓవర్లు రైనా, రోహిత్ లేదా గేల్ కచ్చితంగా వేయాల్సి ఉంటుంది.

Related posts