కరోనా కట్టడికి లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో మటన్ అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని జీహెచ్‌ఎంసీ తెలిపింది. మటన్ ఎక్కువ ధరకు అమ్మే వారిని ఉపేక్షించేది లేదని చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వకీల్ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే మీ జోన్ పరిధిలోని అధికారులకు ఫోన్ చేయాలని సూచించారు.
తెలంగాణ పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇటీవల సమావేశం నిర్వహించి.. గ్రేటర్‌లోని మాంసం దుకాణాల్లో కిలో మటన్ రూ.700కు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో దుకాణదారులు మటన్ ధర పెంచి విక్రయిస్తున్నారు. రూ. 700 కంటే ఎక్కువకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారని వకీల్ పేర్కొన్నారు.