telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ ప్రజల చిరకాల వాంఛ పోలవరం: చంద్రబాబు

chandrababu gift on may day

ఏపీ ప్రజల చిరకాల వాంఛ పోలవరం ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే పనులను పరిశీలించారు. కాపర్ డ్యామ్ పనుల పురోగతి గురించి చంద్రబాబునాయుడు వాకబు చేశారు. 70.17 శాతం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల 40 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉంటుందన్నారు. వచ్చే ఏడాది మే లోపుగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకు, 24 టీఎంసీలు విశాఖలో పరిశ్రమల కోసం కేటాయించనున్నట్టు ఆయన తెలిపారు.

పోలవరం కుడి కాలువ 178 కి.మీ ఎడమ కాలువ 211 కి.మీ ఉంటుందన్నారు. 48 గేట్లను ప్రాజెక్టు కోసం ఏర్పాటు చేశామన్నారు. 30 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే విధంగా ప్రాజెక్టును డిజైన్ చేశామన్నారు. 50 లక్షల క్యూసెక్కుల నీటిని కూడ విడుదల చేసేందుకు వీలుగా ప్రాజెక్టును డిజైన్ చేసినట్టుగా బాబు చెప్పారు. ఈ ప్రాజెక్టు కొరకు 16వేల 493 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ ప్రాజెక్టులో సుమారు 5 వేలకు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. కేంద్రం నుండి ఇంకా 4 వేల కోట్ల నిధులు రావాల్సి ఉందన్నారు.

Related posts