telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ఆర్థిక ప్రగతి సాధ్యం

KTR Nama Nageswar rao

రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం చాలా వరకు ముందుందని… రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక రూట్ మ్యాప్ అని లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. తెలంగాణలో 97% శుద్ధి చేసిన నీళ్లను ఇంటింటికి ఇవ్వడం జరిగిందని.. కరోనా తర్వాత ఆర్థిక పరిస్థితి దిగజారిపోయిందని తెలిపారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే ఆర్థిక ప్రగతి సాధ్యం అవుతుందని… విభజన హామీలు ఇంకా కేంద్రం నెరవేర్చలేదన్నారు. ఇంకా మూడు సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉందని.. ఉభయ సభల్లో ఈ అంశాలను లేవనెత్తుతామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన రైల్వే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని… జాతీయ రహదారి నెంబరింగ్ కూడా పెండింగ్ లో ఉందన్నారు. రైతులకు కావల్సిన నీరు ఇవ్వాలని.. అందులోనూ ఎలాంటి లోటు లేకుండా తమ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని… పండించిన పంటను మద్దతు ధరకు కొనడం ఇలాంటి అంశాల్లో ముందున్నామని గుర్తు చేశారు. రీజనల్ రింగ్ రోడ్డు అంశం పెండింగ్ లో ఉందని… తెలంగాణ కు రావాల్సిన పెండింగ్ నిధుల అంశాన్ని పార్లమెంట్‌లో లెవనెత్తుతామని స్పష్టం చేశారు.

Related posts