telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వరల్డ్ వైడ్‌గా టాప్ 100లో “బుట్టబొమ్మ”కు 15వ స్థానం

Butta

ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని పాటలకు వచ్చిన ప్రేక్షకాదరణ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలోని పాటలు ఆదరణ పొందడం విశేషం. సినిమా విడుదలకు ముందు, విడుదలైన తర్వాత చిత్రంలోని ‘సామజవరగమన’ సాంగ్ సంచలనం సృష్టిస్తే.. సినిమా విడుదల తర్వాత చిత్రంలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్ రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది. ప్రతి ఒక్కరూ ఈ పాటకు డ్యాన్స్‌లు చేస్తూ టిక్ టాక్ వీడియోలు చేస్తున్నారు. తాజాగా ఈ ‘బుట్టబొమ్మ’ సాంగ్ ప్రపంచ రికార్డ్‌ను అందుకున్నట్లుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్వీట్ చేశారు. ఇంగ్లీష్ డైలీలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేసిన థమన్.. ‘‘వరల్డ్ వైడ్‌గా అత్యంత ప్రాచుర్యం పొందిన 100 వీడియో సాంగ్స్‌లో ఈ పాట 15వ స్థానంలో నిలిచింది. మరోసారి బుట్టబొమ్మ సంచలనం’’ అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఒక తెలుగు పాటకు 15వ స్థానం దక్కడం మాములు విషయం కాదు. అందులోనూ టాప్ 100లో 15 వ స్థానం. తెలుగు పాట స్థాయిని ఈ పాట పెంచిందని కామెంట్స్ రూపంలో బన్నీ అభిమానులు థమన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. అయితే ఈ విజయం వెనుక అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఉన్నారని, వారే తనకు ఈ శక్తినిచ్చారని థమన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ కారణం కథ, కథనంతో పాటు ఎస్. ఎస్. థమన్ అందించిన సంగీతం ప్రధాన కారణం.

Related posts