telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా విధించిన ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌!

facebook introduced own digital currency

వినియోగదారుల సమాచారాన్ని పరిరక్షించడంలో విఫలమవుతున్న ఫేస్‌బుక్‌ కంపెనీకి 500 కోట్ల డాలర్ల జరిమానాను అమెరికాలోని ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ విధించింది. ఇంత పెద్ద మొత్తంలో ఓ ఐటీ కంపెనీకి జరిమానా విధించడం ఇదే మొదటిసారి. 3–2 మెజారిటీతో కమిషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది. జరిమానాకు ముగ్గురు రిపబ్లికన్‌ కమిషనర్లు మొగ్గుచూపగా, ఇద్దరు డెమోక్రటిక్‌ కమిషనర్లు వ్యతిరేకించారు.

ఈ నేపథ్యంతో జరిమానా విధిస్తూ చేసిన తీర్మానాన్ని ఎఫ్‌టీసీ సమీక్షకు పంపించింది.పౌర డివిజన్‌కు చెందిన న్యాయవిభాగం ఈ తీర్మానాన్ని సమీక్షించి తుది తీర్పును వెలువరిస్తుంది. అయితే ఈ విచారణకు ఎంతకాలం పడుతుందన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమంటున్నారు సంబంధిత వర్గాలు. 500 కోట్ల డాలర్ల జరిమానా అన్నది భారీ మొత్తం అయినప్పటికీ గతేడాది 3,600 కోట్ల డాలర్ల రెవెన్యూ సాధించిన కంపెనీకి అంత పెద్దదేమీ కాదని వ్యాపార వర్గాలు అంటున్నాయి.

Related posts