telugu navyamedia
రాజకీయ వార్తలు

రోజుకొకటి వేసుకుంటున్నా..అందరినీ ఆశ్చర్యపరిచిన ట్రంప్!

trump usa

ముందస్తు చర్యల్లో భాగంగా కరోనా వైరస్ సోకకుండా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ప్రతి రోజు వేసుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు కరోనాకు విరుగుడంటూ అప్పట్లో ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. భారతదేశం నుంచి పెద్ద ఎత్తున ఈ ట్యాబ్లెట్లను అమెరికా దిగుమతి చేసుకొంది.

అయితే, ఈ మాత్రల వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఆ తర్వాత జరిగిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ మందుల ఉపయోగంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) హెచ్చరికలు కూడా జారీ చేసింది. కరోనా రోగులకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు ఇస్తే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా రోజుకొకటి చొప్పున హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నట్టు ట్రంప్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తనకు కరోనా పరీక్షలు చేసిన వైట్ హౌస్ వైద్యుడిని హైడ్రాక్సీ క్లోరోక్విన్ ట్యాబ్లెట్ల ఉపయోగం గురించి అడిగితే.. మీకు నచ్చితే మంచిద ని సమాధానం ఇచ్చారని, అందుకే వాటిని ఉపయోగిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు పనితనం గురించి తనకు చాలా మంది చెప్పారనీ, మంచి ఫలితాలు వచ్చినట్టు కూడా చెప్పారనీ, అందుకే ముందు జాగ్రత్తగా తీసుకుంటున్నానని ట్రంప్ చెప్పారు.

Related posts