telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఝూటా మాటలతో కెసిఆర్ యువతను మోసం చేశారు : బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్లు నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని.. తెలంగాణ వచ్చాక ..నీళ్లు ఫామ్ హౌజ్ కు, నిధులు సీఎం అనుయాయులకు,
నియామకాలు ఆయన ఫ్యామిలకే పోయాయని ఫైర్ అయ్యారు. తొలి దశ, మలి దశ ఉద్యమానికి ఊపిరే యువత అని..ఆ యువత తెలంగాణ ఏర్పడ్డాక 7 ఏళ్లుగా ఉద్యోగం, ఉపాధి లేక అల్లాడుతోందన్నారు. గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు అవగానే 50 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వస్తోందని ఝూటా మాటలు చెప్పి యువతను మోసం చేశారని.. 25 వేల విద్యుత్ ఆర్జిజన్ ల రెగ్యులరైజేషన్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదన్నారు. లక్షలాది మంది యువతీ, యువకులు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి పడిగాపులు కాస్తున్నారని..ఉద్యోగాల కోసం ఎదురు చూసి.. చాలా మంది వయసు కూడా దాటిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాల కోసం 25 లక్షల మంది TSPSCలో రిజిస్టర్ చేసుకున్నారని పదవి విమరణ పొందిన ఛైర్మన్ ఘంటా చక్రపాణి చెప్పారని..2.90 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని బిస్వాల్ కమిటీ ప్రకటించిందని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్కసారి కూడా గ్రూప్-1 నోటిఫికేషన్ వేయలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? తెలంగాణ ఏర్పడ్డాక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయలేదని ఫైర్ అయ్యారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేశారని మండిపడ్డారు. 2018 నుంచి నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Related posts