telugu navyamedia
రాజకీయ వార్తలు

మళ్ళీ భంగపడ్డ .. పాక్ .. ఇంకా నాటకాలు..

pak agreed to discuss on kartharpur issue

పాక్ మరోసారి అంతర్జాతీయ వేదికపై కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తి అపహాస్యం పాలైంది. శ్రీలంకలోని కొలంబోలో జరుగుతున్న యునిసెఫ్‌ సమావేశంలో పాక్‌ మరోసారి కశ్మీర్‌ అంశాన్ని తెరపైకి తెచ్చింది. కశ్మీర్‌ ప్రజల హక్కులపై దాడి జరగుతోందని లేనిపోని ఆరోపణలు చేసిన పాక్‌ ప్రతినిధికి భారత్‌ తరఫున హాజరైన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్‌ గొగొయి దీటైన సమాధానం ఇచ్చారు. పాక్‌లోని మైనారిటీలపై దాడుల చరిత్రను ఒకసారి చూసుకోవాలంటూ వారిని కడిగిపారేశారు. పాక్ దేశవ్యాప్తంగా మానవ హక్కుల ఉల్లంఘన జరగుతోందని.. ముందు దానిపై దృష్టి సారించాలని గట్టిగా బుద్ధి చెప్పారు. కశ్మీర్‌ అంశం పూర్తిగా అంతర్గత అంశమని తేల్చి చెప్పారు.  గౌరవ్‌తో పాటు భాజపా ఎంపీ సంజయ్‌ జైశ్వాల్‌ ఈ సమావేశంలో భారత్‌ తరఫున పాల్గొన్నారు. పాక్‌ అనవసరంగా కశ్మీర్‌ విషయాన్ని అంతర్జాతీయం చేయాలని చూస్తోందని స్పష్టం చేశారు.

మాల్దీవుల్లో రెండు రోజుల క్రితం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై జరిగిన సదస్సులోనూ పాక్‌ ఇదే తరహా మొండి వైఖరిని ప్రదర్శించిన విషయం తెలిసిందే. పాక్‌ ప్రతినిధి ఖాసిమ్‌ సూరీ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడంతో భారత్‌ తరఫున పాల్గొన్న స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ సింగ్‌ వారి వాదనల్ని దీటుగా తిప్పికొట్టారు. కశ్మీర్‌ విషయం పూర్తిగా భారత అంతర్గత విషయమని.. అంతర్జాతీయ సదస్సుల్లో దీనిపై రాజకీయం చెయ్యొద్దని హెచ్చరించారు. 

Related posts