telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టికెట్లు రాని వారికి నామినేటెడ్‌ పదవులు: కేసీఆర్‌

KCR cm telangana

సీఎం కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జీలతో సమావేస్శమయ్యారు. మున్సిపల్‌ ఎన్నికల బీ ఫారాలను టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌కే సానుకూలంగా ఉందన్నారు. టికెట్లు రాని వారు నిరాశపడకుండా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని కేసీఆర్‌ స్పష్టం చేశారు. టికెట్లు రాని వారికి భవిష్యత్‌లో నామినేటెడ్‌ పదవులు కల్పిస్తామని సీఎం భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ నెల 10వ తేదీ వరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు జనవరి 22న ఎన్నికలు జరగనున్నాయి. 25న ఫలితాలు వెలువడనున్నాయి.

Related posts