telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఇంత దుర్మార్గమైన సీఎం ను చూడలేదు : కోమటిరెడ్డి

 కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు రెండేళ్లుగా అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. అంబేద్కర్ విగ్రహాన్ని జైల్లో పెట్టారంటే సీఎం కేసీఆర్ సిగ్గుపడాలన్నారు. ఇంత అహంకారమైన ముఖ్యమంత్రిని చూడలేదన్నారు. ఏడేళ్లలో అంబేద్కర్ విగ్రహానికి ఒక్కసారి కూడా సీఎం కేసీఆర్‌ నివాళులర్పించ లేదని ఎంపీ కోమటిరెడ్డి విమర్శించారు. అపాయింట్‌మెంట్ అడిగినా ఇంత వరకు ఇవ్వలేదన్నారు. ప్రజల కోసం సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. తెలంగాణను కేసీఆర్ కుటుంబం పాలిస్తోందన్నారు. ప్రతి గ్రామంలో అంబేద్కర్, మహాత్మ గాంధీ విగ్రహాలు ఉండాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను వేలం వేస్తున్నారని, దళితులకు ఇచ్చిన భూములను కాపాడుకుంటామని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు.

Related posts