ఏపీ సీఎం జగన్ చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లులను ఆదుకునేందుకే అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఈ పథకం కింద రూ. 15 వేలు జమచేస్తున్నామని చెప్పారు. దాదాపు 43 లక్షల మంది తల్లులకు ఈ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి ఏటా రూ. 15 వేల చొప్పున అందిస్తామని తెలిపారు.ఈ ఏడాదికి 75 శాతం హాజరు నిబంధనను అమలు చేయడం లేదని తెలిపారు.
మేనిఫెస్టోలో ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు అని చెప్పినా… ఇంటర్ వరకు పొడిగించామని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన జరుగుతుందని తెలిపారు. వచ్చే ఏడాది ఒకటవ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెడుతున్నామని చెప్పారు.
సీఎం జగన్ పై అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు…