telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గాంధీ ఆస్పత్రిని సందర్శించిన కిషన్ రెడ్డి

Kishan Reddy

కేంద్ర కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. తన సిబ్బందితో ఆస్పత్రికి వెళ్లిన ఆయన కరోనా బాధితులకు అందిస్తున్న వైద్యం, వార్డుల్లోని వసతులను నిశితంగా పరిశీలించారు. అనంతరం గాంధీ సూపరింటెండెంట్ తో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వద్ద మంత్రిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిసి తమ గోడు వెల్లడించారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని, వేతనాలు పెంచాలని మంత్రికి ఉద్యోగులు వినతిపత్రం అందించారు.

గత 14 ఏళ్ళుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ 15వేల జీతం మాత్రమే ఇస్తున్నారని కొత్తగా వచ్చిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 29వేల వేతం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి డ్యూటీలకు వస్తున్నామన్నాని వాపోయారు.

Related posts