telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఆలస్యం కానున్న రవితేజ కొత్త సినిమా..?

Raviteja

ఈ ఏడాది సంకరంతికి మాస్ మహారాజ్ రవితేజ సినిమా క్రాక్ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. అయితే ప్రస్తుతం రవితేజ చేస్తున్నసినిమా ఖిలాడి. ఈ సినిమా సురేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తుంది. ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల శివరాత్రి సందర్భంగా విడుదలైన పోస్టర్ ఆ తర్వాత రవితేజ పుట్టినరోజు కానుకగా వచ్చిన గ్లింప్స్ తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే మే 28న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అని ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ పూర్తి చేయలేకపోతుండటంతో రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. అయితే పెన్‌ స్టూడియోస్‌ సమర్పణలో హవీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Related posts