బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా .. ఈ చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుండడంతో నిర్మాతలు, దర్శకులు వివిధ రంగాలకి చెందిన పలువురు ప్రముఖుల బయోపిక్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిసైల్ మ్యాన్, పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం బయోపిక్ రూపొందించేందుకు బాలీవుడ్‌లో సన్నాహాలు జరుగుతున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అబ్దుల్ కలాం బయోపిక్‌ని తమ సంస్థలో రూపొందించబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించింది. రామబ్రహ్మం సుంకర, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో అబ్దుల్ కలాం బయోపిక్‌ని రూపొందించనున్నట్టు తెలుస్తుంది. హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాట.
బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్ కలాం పాత్రలో నటిస్తారని టాక్. ఇటీవల అనీల్ కపూర్‌ని కలిసి స్క్రిప్ట్ వినిపించగా, అది ఆయనకు ఎంతగానో నచ్చడంతో అబ్ధుల్ కలాం బయోపిక్‌లో నటించేందుకు ఈ బాలీవుడ్ స్టార్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ ప్రకటన రానుంది. వచ్చే ఏడాది నుండి ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం రాజ్ చెంగప్ప వ్రాసిన కలాం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనుంది. 83 ఏండ్ల వయస్సులో జూలై 2015న ఐఐఎం షిల్లాంగ్‌లో ప్రసంగిస్తూ కలాం కన్నుమూసిన సంగతి తెలిసిందే.
హీరోలు, టెక్నిషియన్ లు పారితోషికం తగ్గించుకోవాలంటున్న దర్శకుడు