telugu navyamedia
సినిమా వార్తలు

బోల్డ్‌గా సమంత: స్టార్‌ హీరోయిన్‌ అని మరిచిపోయావా అంటూ ట్రోల్స్‌

గ్లామర్‌ పరంగా ఎప్పుడూ వెనక్కి తగ్గని సమంత.. మ్యారేజ్‌ తర్వాత కాస్త పద్ధతిగానే కనిపించింది.కానీ కరోనా లాక్‌డౌన్‌ నుంచి రెచ్చిపోయింది. ఫ్యాషన్‌ దుస్తుల్లో రెచ్చిపోయి అందాలు ఆరబోసింది. ఫ్యాషన్‌కి ఐకాన్‌గా నిలిచింది.

నాగ చైతన్యతో విడాకులు అనంతరం సమంత కెరీర్‌పై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో తన దగ్గరికి వచ్చిన ఆఫర్లకు నో చెప్పకుండా వీలైనంత బిజీగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే సామ్‌ దాదాపు అరడజను సినిమాలను లైన్‌లో పెట్టింది.
మరోవైపు, పాన్‌ ఇండియా చిత్రాల్లోతో పాటు స్పెషల్‌ సాంగ్స్‌, కమర్షియల్‌ యాడ్స్‌తో యాక్టివ్ ఉంటుంది.

అయితే కేవలం కెరీర్‌ పరంగానే కాదు, గ్లామర్‌ షో విషయంలో స్వేచ్ఛగా వ్యవహరిస్తుంది. తనకు నచ్చిన దుస్తులు వేసుకుంటుంది. ఫ్యాషన్‌కి ఐకాన్‌గా నిలుస్తుంది. అంతేకాదు నచ్చిన యాడ్స్, నచ్చిన పనులు చేస్తూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో అందాల ఆరబోత విషయంలో కాస్త హద్దులు దాటుతుందనే విమర్శలు ఎదురవుతున్నాయి. అందుకు నిదర్శనమే సమంత చేసిన లేటెస్ట్ ఫ్యాషన్‌ షో.

తాజాగా బ్లెండర్స్ ప్రైడ్ అనే ఆల్కహాల్ బ్రాండ్‌ ప్రమోట్‌ చేస్తూ ఓ ప్రకటనలో నటించింది. ఈ వీడియోలో ఎద అందాలను ఆరబోస్తూ సామ్‌ కొంచెం బోల్డ్‌గా కనిపించింది. ఎద అందాలను ఆరబోస్తూ కొంచెం బోల్డ్ లుక్ లో కనిపించింది.

దీంతో నెటిజన్స్ అమ్మడిని ఏకిపారేస్తున్నారు..  ‘ఛీఛీ డబ్బు కోసం ఎంతకైనా దిగుజారతావా? స్టార్‌ హీరోయిన్‌ అనే విషయాన్ని మర్చిపోయావా సమంత అంటూ కొంద‌రు నెటిజ‌న్స్‌ ప్రశ్నిస్తున్నారు.

 

Related posts