2014లో బోల్డ్ బ్యూటీ అమలాపాల్ కోలీవుడ్ దర్శకుడు ఏఎల్ విజయ్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి మధ్య విభేదాలు రావడంతో 2017లో విడాకులు తీసుకుని ఈ జంట విడిపోయింది. వీరిద్దరూ విడిపోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అమలాపాల్ సినిమాల్లో నటించే విషయమై ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. విజయ్ నుంచి విడిపోయిన తర్వాత అమలాపాల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇటీవల అమలాపాల్ బోల్డ్ పాత్రలో నటించిన “‘ఆమె” చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. రీసెంట్ గా విజయ్ డాక్టర్ ఐశ్వర్య అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. తాజాగా అమలా పాల్ కూడా త్వరలో రెండో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా కొంతమంది విలేఖరులు మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె బదులిస్తూ.. నేనేమైనా సన్యాసం తీసుకుంటానని చెప్పానా ? త్వరలోనే రెండో పెళ్లి చేసుకుంటా. అదీ కూడా ప్రేమ పెళ్లినే చేసుకుంటా అని చెబుతోంది. ఇక అమలాపాల్ ఏ.ఎల్.విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. అది సక్సెస్ కాలేదు. ఇపుడు రెండో పెళ్లి కూడా ప్రేమించే చేసుకుంటానని చెబుతుంది. దీంతో ఈ విషయం కాస్తా హాట్ టాపిక్ గా మారింది.
previous post
హృతిక్ చూడు నిన్ను కంగనా ఏం చేస్తుందో… కంగనా సోదరి హెచ్చరిక