telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క్లబ్ డ్యాన్సర్ గా రకుల్… సెక్సీ వీడియో సాంగ్

Rakul

రకుల్‌కు తెలుగులో ఉన్నంత పాపులారిటీ బాలీవుడ్‌లో లేదు. అరకొర సినిమాలతో నెట్టుకొస్తున్నారు. బాలీవుడ్‌లో రకుల్ నటించిన ‘దే దే ప్యార్ దే’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. తాజాగా రకుల్ క్లబ్ డ్యాన్సర్‌గా నటించిన హిందీ చిత్రం ‘మర్జావా’. సిద్దార్థ్ మల్హోత్రా, తారా సుతారియా జంటగా నటించారు. ఈ సినిమాలోని ‘హయ్యా హో’ అనే సాంగ్ వీడియో ఒకటి విడుదలైంది. తులసీ కుమార్, జుబిన్ నౌటియాల్ ఈ పాటను పాడారు. ఇందులో రకుల్ చీర కట్టుకుని క్లబ్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. సాంగ్ కు ముందు రకుల్, సిద్ధార్థ్‌తో మంచంపై పడుకుని, ఏడుస్తున్న సన్నివేశాన్ని చూపించారు. బాధతో మందు తాగుతున్న సిద్ధార్థ్‌ను వద్దు అంటూ రకుల్ ఓదారుస్తూ కనిపించారు. ఈ పాట కోసం రకుల్ నడుంపై టాటూ వేయించుకున్నారు. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మిలాప్ జవేరీ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ‘మర్జావా’ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Related posts