నేడు ఆరో దశ పోలింగ్ కొనసాగుతుంది. పలువురు ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హర్యానాలోని గురగ్రావ్‌లో గల పైన్‌క్రెస్ట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో విరాట్ క్యూలైన్‌లో నిలబడి ఓటేశారు.
భోపాల్‌లో సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, ఢిల్లీలో కేజ్రీవాల్, మాజీ క్రికెటర్, బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ తదితరులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే గతంలో కోహ్లీ తనకు ఓటు వినియోగించుకునే అవకాశం ఉండకపోవచ్చునని అన్న విషయం తెలిసిందే. అయితే ఐపీఎల్ నుండి తన టీం రెండొదశలోనే ఓటమిపాలై, ఓటు వేసేందుకు అవకాశం దొరికింది. దానితో నేడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు కోహ్లీ. అన్నీ మన మంచికే అనేదానికి ఇదో ఉదాహరణ.