తేనే ఎంత గొప్పదో వైద్యులే నిరూపించారు. దీనిని ఆహారంలోనే కాకుండా, యాంటీ బ్యాక్టీరియల్‌గా కూడా వాడొచ్చని రుజువుచేశారు. ఇటీవల రోస్కిల్డ్ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి..ఎంత ప్రయత్నించినా తన శిశ్నాగ్ర చర్మం వెనక్కి వెళ్లడం లేదంటూ వైద్యులను ఆశ్రయించాడట..అతడి అంగాన్ని పరీక్షించిన వైద్యులు, అతడికి ‘బలనోపోస్తిటీస్’ ఏర్పడిందని, దీనివల్ల అతడి శిశ్నాగ్రంపై గడ్డలు ఏర్పడినట్లు తెలిపారు.వాటివల్ల ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ ఏర్పడిందని, సర్జరీ చేసి ఆ గడ్డలను తొలగించాలని అతడికి చెప్పారు. అతను ఒప్పుకోవడంతో వైద్యులు బాధితుడి శిశ్నాగ్ర చర్మాన్ని చీల్చి గడ్డలు తొలగించారు. ఆ తర్వాత అంగాన్ని చుట్టుకుని ఉండే ఆ చర్మం చాలా పలుచగా ఉండటంతో దాన్ని తిరిగి అతికించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
దీంతో వైద్యులు చర్మాన్ని దగ్గరకు లాగి సర్జికల్ ప్లాస్టర్‌తో అతికించి దానిపై తేనె పోసి డ్రెస్సింగ్ చేశారట. రెండు వారాల తర్వాత పరిశీలించగా..ఆ అంగం మీద చర్మం అతుక్కుపోయిందట.ఈ అరుదైన చికిత్స వివరాలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జీరీ కేస్ రిపోర్ట్స్‌లో వెల్లడించారు వైద్యులు. ఇలాంటి చికిత్సలకు తెనే వాడటమే ఉత్తమం అని, తేనే యాంటి బ్యాక్టీరియల్‌గా పని చేస్తుందని, దాని వల్ల ఎలాంటి నొప్పి కలిగదని తెలిపారు.దీన్ని బట్టి తేలిందేంటంటే తేనెను అత్యవసర పరిస్థితుల్లో యాంటీబయోటిక్‌గా కూడా వాడవచ్చు. ఈ నేపథ్యంలో అంగం, శిశ్నాగ్న, ఇతరాత్ర చర్మ సమస్యలను ఎదుర్కొనేవారికి తేనె మంచి ఔషదమని వారు పేర్కొన్నారు.