అతి త్వరలో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) నిర్వహించడానికి పాఠశాల విద్యాశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పం పారు. ప్రభుత్వం నుంచి అమోదం లభించిన వెంటనే టెట్‌కు నోటిఫికేషన్ వెలువడుతుందని ఆ శాఖ అధికారులు తెలిపా రు.
ఈ సారి ఆన్‌లైన్‌లో టీఎస్ టెట్‌ను నిర్వహించాలనే ప్రతిపాదనలను పంపినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని, రెండు లక్షల మందికిపైగా హాజరయ్యే అవకాశముందన్నారు.