telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

kcr pragati bhavan

తెలంగాణలో 74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ప్రగతి భవన్‌లో నిరాడంబరంగా జరిగాయి. సీఎం కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు, అధికారులతో కలిసి జాతీయ పతాకం ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. అనంతరం సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్ళి అమరులకు నివాళర్పించారు. దేశానికి సేవ చేసిన వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఆయన వెంట పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులున్నారు.

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం దగ్గర్నుంచీ గోల్కొండ కోటలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఈసారి వేడుకల వేదికను ప్రగతి భవన్‌కు మార్చారు. కేవలం ముఖ్యనాయకులు, కొద్దిమంది అధికారుల సమక్షంలోనే ఈ వేడుకలను నిర్వహించారు.

Related posts