telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మహారాష్ట్రలో మళ్ళీ పూర్తిస్థాయి లాక్ డౌన్… కానీ..?

మన దేశంలో ఈ మధ్య రోజువారీ కరోనా కేసులు 80 వేలకు పైగా వస్తున్నాయి. అయితే అందులో సగం కేవలం ఒక్క మహారాష్ట్ర నుండే వస్తున్నాయి. దాంతి ఈ కరోనాను వ్యాప్తిని అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నేడు కొత్త ఆంక్షలను తీసుకొని వచ్చింది. ప్రతి శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు వారాంతపు లాక్ డౌన్ అలానే ప్రతి రాత్రి కర్ఫ్యూ విధించనున్నారు. అయితే పెరుగుతున్న కరోనా కేసుల పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశం మీద చర్చించడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఆదివారం రాష్ట్రానికి చెందిన బిజినెస్ మ్యాన్ బృందాన్ని కలిశారు. సీఎం మరియు పారిశ్రామికవేత్తల మధ్య మధ్యాహ్నం జరిగిన వర్చువల్ సమావేశానికి పరిశ్రమ లాబీ సిఐఐ జాతీయ అధ్యక్షుడు, బ్యాంకర్ ఉదయ్ కోటక్ నాయకత్వం వహించినట్లు అధికారులు తెలిపారు. అయితే చూడాలి మరి ఈ పద్ధతి అక్కడ ఎంత మేర పని చేతుంది అనేది. ఒకవేళ ఈ ప్లాన్ పనిచేతే మిగిలిన అన్ని రాష్ట్రాలు దీనినే అనుసరిస్తాయి అనడంలో సందేహం లేదు.

Related posts