ఈ ఏడాది జరిగే ఐపీఎల్ 14వ ఎడిషన్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడబోతున్నాడు. గత ఫిబ్రవరి 18న జరిగిన మినీ వేలంలో అలీని రూ. 7కోట్లకు సీఎస్కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే 2021లో సీఎస్కేకు ఆడుతున్న అలీ.. ఆ టీమ్ జెర్సీ వేసుకోలేనని చెప్పాడు. ఆ జెర్సీపై ఆల్కహాల్ బ్రాండ్ లోగో ఉండటమే దీనికి కారణం. అయితే మొయిన్ అలీ ఓ ముస్లిం. ఆల్కహాల్ తీసుకోవడం, వాటిని ప్రోత్సహించడం ఇస్లాం మత ఆచారాలకు విరుద్ధం. దీంతో అలీ ఇంగ్లండ్ టీమ్‌కే కాదు.. ఏ దేశవాళీ జట్టుకు ఆడినా కూడా ఆల్కహాల్ బ్రాండ్ జెర్సీలు ధరించడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ జెర్సీపై ఎస్ఎన్జే 10000 బ్రాండ్ లోగో ఉంది. ఇది చెన్నైలో ఉన్న ఎస్ఎన్జే డిస్టిలరీస్‌కు చెందినది. ఈ లోగోను తొలగించాలని అలీ కోరగా.. అందుకు సీఎస్కే యాజమాన్యం అంగీకరించింది. ఇంతకముందు అలీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కి ఆడినప్పుడు కూడా ఆల్కహాల్ లోగో లేని జెర్సీనే ధరించి ఆడాడు. అయితే గత మూడు సీజన్లలో బెంగళూరుకు ఆడిన మొయిన్ అలీ.. తొలిసారి చెన్నైకి ఆడుతున్నాడు.
previous post