telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

కోవిడ్ నిబంధనలను బేఖాతరు చేసినందుకు రిజైన్ స్కై బార్ సీజ్…

కరోనా అన్ని దేశాలను ఆర్ధికంగా చాలా నష్టం కలిగించింది. దాదాపు ఆరు నెలలు అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. కానీ మళ్ళీ ఇప్పుడిపుడే అవి తెరుచుకుంటున్నాయి. ఇక మన దేశంలో ఈ మధ్యే పార్క్ లకు అలాగే బార్ లకు అనుమతించింది ప్రభుత్వం. అందులో కరోనా నిబంధనలు పాటించాలని తెలిపింది. కానీ కోవిడ్ నిబంధనలను బేఖాతరు చేసినందుకు రిజైన్ స్కై బార్ ను సీజ్ చేసారు అధికారులు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బార్లో పనిచేసే వెయిటర్లు మాస్క్ లు ధరించలేదని అధికారులు గుర్తించారు. ఆ బార్ పై రైడ్ నిర్వహించారు ఎక్సయిజ్ శాఖ అధికారులు. బార్ కౌంటర్ దగ్గర పరిమితికి మించి జనం గుమిగూడారని నిర్ధారణ చేసారు. అయితే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆ వీడియో చేరింది. కస్టమర్లు, సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టే విధంగా యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని అభియోగం వచ్చింది. ఇంతలోనే సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఎక్సయిజ్ శాఖకు పంపి దర్యాప్తునకు ఆదేశించారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. తెలంగాణా ఎక్సయిజ్ చట్టం సెక్షన్ 31 (1), 41, ఏపీ ఎక్సయిజ్ రూల్స్ 2005 లోని రూల్ 33, 38 ప్రకారం బార్ యాజమాన్యంపై కేస్ నెంబర్ 36/2020 నమోదు చేసింది ఎక్సయిజ్ శాఖ.

Related posts