telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ప్రభుత్వ ఉద్యోగులకు .. జీతాల జాప్యం.. ఆరునెలలకు ఒక్కసారి..

jr.panchayat secretaries on their job and salaries

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శు(జేపీఎస్‌)లు ఎన్నో ఆశలతో ఉద్యోగ బాధ్యతలు తీసుకుని తప్పని పరిస్థితులలో విధి నిర్వహణలో నెట్టుకు వస్తున్నారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటి..కొలువు కొట్టి భరించలేని ఒత్తిడి నడుమ విధులు నిర్వహించలేక, వచ్చే వేతనం చాలక అవస్థలు పడుతున్నారు. ఆఖరుకు తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్న దయనీయ పరిస్థితి జిల్లాలో నెలకొంది. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల కోసం ఎంతగానో ఎదురు చూసిన వీరు, ఆ పోస్టులో చేరిన కొద్ది రోజుల్లోనే తమకు ఈ జాబ్‌ సరిపడదని కొందర, ఇతర ఉద్యోగాలు రావడంతో మరికొందరు గుడ్‌బై చెబుతున్నారు. ఇలా..ఆరునెలల కాలంలోనే 20మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు తమ ఉద్యోగాలను వీడారు. 2018 అక్టోబర్‌లో ప్రభుత్వం జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాల భర్తీకి పరీక్ష నిర్వహించింది. ప్రతిభ కనబర్చిన వారికి 2019 ఏప్రిల్‌లో నియామక పత్రాలు అందించారు.

జిల్లాలో 584 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటిలో 422మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా కొలువు దీరారు. ఉద్యోగాలు రావడంతో ఆనందపడ్డారు. మొదట్లో ఉన్న సంతోషం మెల్లమెల్లగా సన్నగిల్లింది. ప్రతి నెలా రావాల్సిన వేతనాల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు పని ఒత్తిడి ఎక్కువ కావడం.. జీతాల్లో తీవ్ర జాప్యంతో ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో 20మంది జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు రాజీనామా చేసి వెళ్లిపోగా, ఒకరు మరణించగా, మరొకరు ఇప్పటి వరకు విధులకు హాజరుకావట్లేదు. ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం సైతం అందించలేదు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా విధుల్లో చేరిన వారికి కనీస ఉద్యోగ భద్రత లేదు. రూ.15వేల రూపాయల వేతనంతో మూడేళ్ల పాటు పని చేయాలని ఒప్పందం ఉండడంతో చాలా మంది ఉద్యోగాలకు మంగళం పాడుతున్నట్లు తెలుస్తోంది. వివిధ శాఖల్లో ఉద్యోగాలు రావడంతో కొందరు ఉద్యోగాలు మానివేయగా, మరికొందరు మాత్రం ఉద్యోగాలకు భద్రత లేకపోవడంతో పాటు కనీస వేతన స్కేలు అమలు చేయకపోవడం వల్లే విధుల నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.

Related posts