telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీర్ ప్రజల సంబంధాలను భారత్ తెంచివేసింది: పాకిస్తాన్

Surgical Strike 2Pakistan Indian air space

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్ ను భారత ప్రభుత్వం రద్దు చేసినప్పటి నుంచి పాకిస్తాన్ అట్టుదూకిపోతుంది. ఇది భారత్ అంతర్గత విషయమని ప్రపంచదేశాలన్నీ సమర్ధించినప్పటికీ, పాక్ మాత్రం కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసేందుకు అందివచ్చే ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. లేనిపోని ఆరోపణలతో తమ వక్రబుద్దిని ప్రదర్శిస్తోంది.

కశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం కోసం భారత్ తో సంప్రదింపులను తాము కోరుకుంటున్నట్టు పాక్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి తెలిపారు. మంగళవారంనాడు ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతో సమర్ధవంతమైన విదేశాంగ విధానం ద్వారా పాక్ ప్రపంచ దేశాల్లో గుర్తింపుపొందిందని అన్నారు. భారత బలగాలు కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను మూసివేయడం ద్వారా బయట ప్రపంచంతో కశ్మీర్ ప్రజల సంబంధాలను తెంచివేసిందని ఆరోపించారు.

Related posts