ఢిల్లీ కాలుష్యంపై బీజేపీ నేతలే రాజకీయాలు చేస్తున్నారని సీఎం కేజ్రివాల్ అన్నారు. ఢిల్లీలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరవింద్ కేజ్రివాల్ రాజకీయాలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలను కేజ్రివాల్ తప్పు పట్టారు. అంతే కాకుండా కాలుష్యంపై ఢిల్లీలో కాలుష్య నివారణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆరోపించారు.
ప్రకటనపై వేల కోట్లు ఖర్చు చేస్తూ కాలుష్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని కేజ్రివాల్‌పై కేంద్ర మంత్రులు ప్రకాష్ జావడేకర్, విజయ్ గోయెల్‌ల మండిపడ్డారు. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రివాల్.. కేంద్ర మంత్రుల వ్యాఖ్యలపై స్పందిస్తూ ఢిల్లీలో ప్రకటనల కోసం ఖర్చు చేసింది. కేవలం 40 కోట్ల రూపాయలే. ఢిల్లీ ఆదాయంలో అది అత్యంత స్వల్పం. అయినా మేము మా సొంత ప్రకటనలు చేసుకోలేదన్నారు. డెంగ్యూ బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేసేందుకే ప్రకటనలు చేసినట్టు పేర్కొన్నారు.
కేసీఆర్ ఇంట్లో కుక్క చనిపోతే డాక్టర్లపై కేసులా ?: విజయశాంతి