సామజిక మాద్యమాలతో ఏది నిజమైన వారితో, ఏదో అబద్దమైనదో అర్ధం కావటంలేదు. గత కొంత కాలంగా నాణేలపై కూడా ఈ ఉన్నాయి. ఈ వార్తల ప్రకారం నాణేలు రద్దుచేశారని, అవి చెల్లవని అందరూ అనుకుంటున్నారు. ఈ వార్త ప్రజలకే కాదు ప్రభుత్వ్ ఉద్యోగులను కూడా కొన్నాళ్ళు ఇబ్బంది పెట్టింది, ప్రజలు నాణేలు ఇస్తుంటే పుచ్చుకోడానికి ప్రభుత్వ ఉద్యోగులే ముందుకు రానిపరిస్థితులు దారితీయటంతో ఆర్బీఐ అధికారులు రంగంలోకి దిగారు. 50 పైసలు, రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయల నాణేలు చలామణిలో ఉన్నాయని భారతీయ రిజర్వుబ్యాంకు స్పష్టం చేసింది. రూపాలు, డిజైన్లలో తేడా ఉన్నా నాణేలన్నీ చెల్లుబాటు అవుతాయని, ప్రజలు, దుకాణదారులు వాటిని తీసుకోవాలని కోరింది.
ఈ మధ్య నాణేలు చెల్లుబాటు కావడం లేదన్న ఉద్దేశంతో, వాటిని ఎవరూ కూడా తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. చివరికి బస్సుల్లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు స్పష్టత ఇచ్చిన ఆర్‌బీఐ మరోమారు ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. నాణేలను ప్రభుత్వం రద్దు చేసిందన్న వార్తల్లో నిజం లేదని, అందరూ తప్పకుండా వీటిని తీసుకోవాలని సూచించింది. బ్యాంకులు కూడా లావాదేవీల సమయంలో నాణేలను స్వీకరించాలని ఆదేశాలు జారీ చేసింది.