telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నీరవ్‌మోడీకి .. రిమాండ్‌ పొడిగించిన లండన్ కోర్టు ..

nirav modi in Landon caught by media

పంజాబ్‌నేషనల్‌ బ్యాంకు కు 13వేల కోట్ల మేర టోకరా వేసిన నిరవ్ మోడీకి మళ్ళీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఉద్దేశ్యపూర్వక ఎగవేత అభియోగాలు, అవినీతి అభియోగాలు ఎదుర్కొంటూ లండన్‌ జైలులో ఉన్న నీరవ్‌మోడీకి నవంబరు 11వ తేదీవరకూ రిమాండ్‌ను పొడిగించారు. లండన్‌ జైలు నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ సమావేశంలో న్యాయమూర్తి విచారణ నిర్వహించారు. వెస్ట్‌మినిస్టర్స్‌ మేజిస్ట్రేట్‌కోర్టు జడ్జి నినా టెంపియా మోడీని భారత్‌కు అప్పగింత విచారణ వచ్చే ఏడాది మే 11 నుంచి 15వ తేదీలోపు అమలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.

ప్రతి 28 రోజులకు ఒక పర్యాయం నీరవ్‌మోడీ వీడియోలింక్‌ సమావేశానికి హాజరుకావాల్సి ఉంటుందని, అప్పటివరకూ విచారణ జరుగుతుందని వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి నిరంతర విచారణ కొనసాగుతుందని వివరించారు. 48ఏళ్ల నీరవ్‌మోడీ కేవలం తన పేరు, పుట్టిన తేదీలను మాత్రమే ధృవీకరించారు. మోసం, మనీలాండరింగ్‌, అవినీతి ఆరోపణలు భారత్‌లో ఎదుర్కొంటున్నారు. వాండ్స్‌వర్త్‌ జైలులో ఆయన్ను రిమాండ్‌లో ఉంచారు. ఈ జైలు లండన్‌లోని అత్యంత రద్దీగా ఉండే జైళ్లలో ఒకటి.

Related posts