తెలంగాణ సెక్రెటేరియట్ కూల్చివేత, నూతన అసెంబ్లీ నిర్మాణాలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలును మరచి భవనాలను కూలగొడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుబట్టారు.
ఆంధ్రా వాళ్లు కూడా వెళ్లిపోవడంతో ఇప్పుడున్న సెక్రటేరియట్ తెలంగాణకు పూర్తిగా సరిపోతుందన్నారు. రెండు రాష్ట్రాలకు సరిపోయే అసెంబ్లీ ఉండగా కొత్త అసెంబ్లీ అవసరమా? అని ప్రశ్నించారు. ఇలాంటి వాటికి మద్దతిస్తున్న ఎంఐఎం వాళ్లు చార్మినార్‌ను కూలగొడితే ఏం చేస్తారని వీహెచ్ నిలదీశారు.