కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. సమీప భవిష్యత్తు తనకు నిజమైన పరీక్షని 74 ఏళ్ల వయసులో ఉన్న ట్రంప్ అన్నారు. దీనిలో విజయం సాధించి బయటకు వస్తాననే అనుకుంటున్నానని అన్నారు. నేను ఇక్కడికి రావడం ఏమంత మంచిగా అనిపించడం లేదు. ప్రస్తుతం కొంచెం ఫర్వాలేదు. త్వరలోనే బయటకు వచ్చి, నేను ప్రారంభించిన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తాననే భావిస్తున్నానని తెలిపారు.
రానున్న రెండు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలని అన్నారు. ప్రస్తుతం తాను ఆసుపత్రి నుంచి పనిచేయడం మినహా మరేమీ చేయలేనని ట్రంప్ పేర్కొన్నారు. ఈ వీడియో భారత కాలమానం ప్రకారం, ఈ తెల్లవారుజామున విడుదల కాగా, దీన్ని ముందుగానే చిత్రీకరించారా? లేదా వాల్టర్ రీడ్ ఆసుపత్రిలో చేరిన తరువాత షూట్ చేశారా? అన్న విషయమై స్పష్టత లేదు.